Jayaprakash Narayan: నేనేమైనా అంటే కొందరు బాధపడతారు!: బడ్జెట్ పై జేపీ కీలక వ్యాఖ్యలు

  • స్టాక్ మార్కెట్ కు మేలు చేసేలా బడ్జెట్
  • భారీ లాభాలు పొందితే కొంత పన్ను తప్పేమీ కాదు
  • సంపన్నులు బాధపడినా నా అభిప్రాయం అదే
  • ఓ ఇంటర్వ్యూలో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్, గత వారంలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ గురించి తానేమైనా అంటే సంపన్నులు, ఎగువ మధ్య తరగతి వారు కొందరు బాధపడతారని, అయినా తన అభిప్రాయం మాత్రం బడ్జెట్ బాగుందనేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. స్టాక్ మార్కెట్ కు బడ్జెట్ మేలు చేస్తుందని తెలిపారు.

 స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలను తెచ్చుకున్న వారి నుంచి కొంత పన్ను వసూలు చేయడం తప్పేమీ కాదని అన్నారు. తన దృష్టిలో ఇది మంచి పరిణామమని అన్నారు. ఎక్కువకాలం పాటు పెట్టుబడులను కదల్చని వారి నుంచి స్వల్ప మొత్తంలో పన్ను వసూలు చేయడం మంచిదేనని పేర్కొన్నారు. బడ్జెట్ తరువాత ధనికులు, పేదలపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉంటుందన్న విషయమై తనదైన శైలిలో విశ్లేషించారు. జేపీ ఇంటర్వ్యూ వీడియోను మీరూ చూడవచ్చు.

Jayaprakash Narayan
Loksatta
Interview
Budjet
  • Error fetching data: Network response was not ok

More Telugu News