Telugudesam: టీడీపీ ఎంపీ రాయపాటి కుమారుడి వేధింపులు భరించలేక డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

  • కుమారుడి కూతురి నుంచి రూ.15వేల అడ్వాన్స్
  • తిరిగి చెల్లించాలంటూ వేధింపులు
  • తనను, కుటుంబాన్ని హింసిస్తున్నారని డ్రైవర్ ఆరోపణ

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి వేధింపులు భరించలేక కారు డ్రైవర్ విజయరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. రాయపాటి కుమారుడు రంగారావు కుమార్తె కారు డ్రైవర్‌గా పనిచేసినప్పుడు అడ్వాన్స్‌గా రూ.15 వేలు తీసుకున్నానని, ఇప్పుడవి చెల్లించకపోతే చంపుతానని రంగారావు, కోటపాటి పూర్ణచంద్ర, డ్రైవర్ వెంకటేశ్‌లు బెదిరిస్తున్నారని సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు.

కులం పేరుతోనూ తనను వేధించారని పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు ఈ ముగ్గురే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విజయరాజును వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Telugudesam
Rayapati Sambasiv Rao
Driver
Andhra Pradesh
  • Loading...

More Telugu News