DGP: రేపు రాష్ట్రంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం: బంద్‌పై ఏపీ డీజీపీ

  • బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన‌ అన్యాయంపై నిర‌స‌నగా రేపు బంద్
  • శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలకు ఆదేశాలు  
  • పలు ప్రాంతాల్లో అదనపు బలగాలు
  • స్థానిక పరిస్థితులను బట్టి ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం

పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన‌ అన్యాయంపై నిర‌స‌న తెలుపుతూ రేపు ప్ర‌తిప‌క్ష పార్టీలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రేపటి బంద్ గురించి స్పందించిన ఏపీ డీజీపీ మాలకొండయ్య మీడియాతో మాట్లాడుతూ... అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నామని, స్థానిక పరిస్థితులను బట్టి ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.    

DGP
bundh
Andhra Pradesh
  • Loading...

More Telugu News