Andhra Pradesh: ఏపీకి ఇక ఇచ్చేదేమీ లేదని మోదీ పరోక్షంగా చెప్పారు : కాంగ్రెస్ నేత శివాజీ

  • ఏపీకి జరిగిన అన్యాయంపై మోదీ మాట్లాడకపోవడం దారుణం
  • మోడీ ప్రసంగాన్ని అడ్డుకోకుండా టీడీపీ నేతలు తోకముడిచారు
  • ఇది ఆంధ్రులకు అవమానకరం : కొలనుకొండ శివాజీ

ఏపీకి ఇక ఏమీ ఇచ్చేది లేదనే విషయాన్ని ప్రధాని మోదీ పరోక్షంగా చెప్పారని ఏపీ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. లోక్ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో ఆంధ్రా ఎంపీలు ఆందోళన చేస్తున్నా మోదీ తన ప్రసంగంలో మన రాష్ట్రం గురించి ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో మోదీ ప్రసంగాన్ని అడ్డుకోకుండా టీడీపీ నేతలు తోకముడిచారని, ఆంధ్రులకు అవమానకరమని అన్నారు. ఏపీపై కేంద్రం తీరును నిరసిస్తూ తలపెట్టిన బంద్ కు అన్నిపార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. 

Andhra Pradesh
Congress
shivaji
  • Loading...

More Telugu News