Narendra Modi: మోదీ కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది: శివసేన ఎంపీ మనీషా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2c71cc31baa71fca02ceb7d8483c617cc079ae3b.jpg)
- గెలిచి నాలుగేళ్లైనా మోదీలో మార్పు రాలేదు
- కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే మోదీని ప్రజలు ఎన్నుకున్నారు
- మోదీ నుంచి సంక్షేమ పథకాలను కోరుకున్నారు
లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై శివసేన తనదైన శైలిలో స్పందించింది. ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలను చేపట్టి నాలుగేళ్లు అవుతోందని... అయినా ఆయనలో కొంచెం కూడా మార్పు రాలేదని శివసేన ఎంపీ మనీషా అన్నారు.
ఆయన కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని... లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగానే మోదీని ప్రజలు ఎన్నుకున్నారని... ఈ విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలని అన్నారు. మోదీ నుంచి సంక్షేమ పథకాలను ప్రజలు కోరుకుంటున్నారని... కాంగ్రెస్ పార్టీపై విమర్శలను కాదని ఎద్దేవా చేశారు.
మరోవైపు మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా విమర్శలు గుప్పించారు. మోదీ మంచి మాటకారే అయినప్పటికీ... లోక్ సభలో ఈరోజు ఆయన చేసిన ప్రసంగం పూర్తిగా అసత్యాలు, వక్రీకరణలతో కొనసాగిందని అన్నారు.