nayanatara: త్వరలో నయనతార పెళ్లి.. కొత్త ఇంట్లో కాపురం?

  • ప్రభుదేవాతో ప్రేమలో విఫలమైన తరువాత విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో నయనతార
  • గతేడాది కొచ్చిలోని చర్చిలో వివాహం చేసుకున్నారంటూ కథనాలు
  • త్వరలో వివాహ ప్రకటన చేయనున్న విఘ్నేశ్ శివన్, నయనతార

దక్షిణాది సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా స్టార్ కథానాయికగా రాణిస్తున్న నయనతార త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు కోలీవుడ్ గుసగులాడుకుంటోంది. గతంలో శింబు, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో కొనసాగిన సమయంలో కూడా నయనతార పెళ్లి పీటలెక్కుతుందని కథనాలు వెలువడ్డప్పటికీ అలా జరగలేదు. ప్రభుదేవాతో బ్రేకప్ తరువాత తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తో ఆమె ప్రేమలో పడిందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిని వారిద్దరూ ఖండించలేదు.
 
ఆ మధ్య జరిగిన విఘ్నేశ్‌ పుట్టిన రోజుకు నయనతార ఖరీదైన కారు కొనిచ్చిందని వార్తలొచ్చాయి. అలాగే, ఆ మధ్య వారిద్దరికీ కొచ్చిలోని ఒక చర్చిలో రహస్యంగా వివాహం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వారింకా పెళ్లి చేసుకోలేదని, త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. వివాహానంతరం వారిద్దరూ కలిసి చెన్నైలో కొత్తగా కొన్న ఇంట్లో కాపురం పెట్టనున్నట్టు తెలుస్తోంది. 

nayanatara
vighnesh shivan
marriage announcement
  • Loading...

More Telugu News