Odisha: వేపచెట్టు నుంచి రెండు రోజులుగా పాలు... భారీగా చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తోన్న ప్రజలు

  • పొలం వెళుతూ గుర్తించిన ఓ వ్యక్తి
  • విషయం తెలుసుకుని తరలివస్తోన్న స్థానికులు
  • ఒడిశాలోని గంజాం జిల్లాలోని కళ్లికోట్‌ ప్రాంతంలో విచిత్రం

రెండురోజులుగా ఓ వేప చెట్టు నుంచి పాలు కారుతోన్న దృశ్యం ఒడిశాలోని గంజాం జిల్లాలోని కళ్లికోట్‌ ప్రాంతంలో క‌న‌ప‌డుతోంది. వేప చెట్టు నుంచి పాలు కార‌డం ఏంట‌ని చుట్టుప‌క్క‌ల గ్రామాల వారంద‌రూ విచిత్రంగా చూస్తున్నారు. దేవుడి మ‌హిమేనంటూ పూజ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు.

కళ్లికోట్‌ బ్లాక్‌ పరిధి డిమిరియా పంచాయతీలోని పొలుదుపల్లి గ్రామ శివారులోని ఓ పొలం గుండా వెళుతోన్న సుదర్శన్‌ నాయక్ అనే వ్య‌క్తి ఈ దృశ్యాన్ని మొద‌టిసారిగా గమ‌నించాడు. అనంత‌రం అతడు వెళ్లి, ప‌లువురికి చెప్ప‌డంతో ఈ ప్రాంతాల వాసులంతా వేప‌ చెట్టు వ‌ద్ద‌కు క్యూ క‌ట్టారు. కొంద‌రు పసుపు, కుంకుమలు వేప చెట్టుకి పెట్టి పూజ‌లు చేసే ప‌నిలో మునిగి తేలుతున్నారు.

  • Loading...

More Telugu News