Narendra Modi: దేశ ప్రజలు ఇలాంటి ఉపన్యాసాలు కోరుకోవడం లేదు: మోదీ ప్రసంగంపై సోనియాగాంధీ ఫైర్

  • మోదీ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు
  • జనాలకు ఉపాధి కావాలి
  • ఇలాంటి ప్రసంగాలు అవసరం లేదు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన ప్రధాని మోదీ... కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సంగతి తెలసిందే. దేశం విచ్చిన్నం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్టీ దేశాన్ని నాశనం చేసిందంటూ విమర్శించారు. ఆయన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను విమర్శిస్తూనే సాగింది. ఏపీకి అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

తర్వాత మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మోదీ ప్రసంగం ఎప్పట్లాగానే ఉందని, అందులో కొత్తదనమేమీ లేదని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి అవకాశాల గురించి మోదీ ప్రస్తావించలేదని అన్నారు. తమ భవిష్యత్తుపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. దేశ ప్రజలు ఉపాధిని కోరుకుంటున్నారని... ఇలాంటి ఉపన్యాసాలకు కాదని సెటైర్ వేశారు.

Narendra Modi
Sonia Gandhi
modi speech
lok sabha
  • Loading...

More Telugu News