sitharam yechury: రాజ్యసభకు త్రిపుర నుంచి సీతారాం ఏచూరికి అవకాశం!

  • త్రిపుర రాజ్యసభ సభ్యురాలి స్థానంలో పంపే ఆలోచన
  • త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జర్నదాస్ బైద్య
  • గెలిస్తే ఆమె రాజీనామాతో సీతారాం ఏచూరికి అవకాశం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజ్యసభకు తిరిగి నామినేట్ అవడం ఖాయమైపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్రిపుర రాష్ట్రం తరఫున ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న జర్నదాస్ బైద్య అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఆమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు.

దాంతో ఆమె స్థానంలో సీతారాం ఏచూరిని పెద్దల సభకు పంపించాలని పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి బైద్య రాజ్యసభ సభ్యత్వం 2022 వరకు ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఆమెను పార్టీ ఒప్పించింది. రాష్ట్ర ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇచ్చేందుకు హామీ కూడా ఆమెకు లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News