Narendra Modi: అశోక్ గజపతిరాజు శాఖపై మోదీ ప్రశంసలు!

  • విమానయాన శాఖపై ప్రధాని ప్రశంసలు
  • అద్భుతమైన విమానయాన విధానాన్ని తీసుకొచ్చాం
  • చిన్నచిన్న పట్టణాలకు కూడా విమానాశ్రయాలను తెచ్చాం

టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు నిర్వహిస్తున్న పౌరవిమానయాన శాఖపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. లోక్ సభలో ఆయన ప్రసంగిస్తూ అద్భుతమైన విమానయాన విధానాన్ని తాము తీసుకొచ్చామని తెలిపారు. చిన్నచిన్న పట్టణాలకు కూడా విమానాశ్రయాలను తీసుకొచ్చామని చెప్పారు. యావత్ దేశానికి రెక్కలు తొడిగామని తెలిపారు.

ఆధార్ కార్డ్ ను కాంగ్రెస్ పార్టీ రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని భావిస్తే... అదే ఆధార్ కార్డును తాము సగటు మనిషికి ఆధారంగా తీర్చి దిద్దామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విఫలమైన ప్రతి చోటా, తాము విజయవంతమయ్యామని తెలిపారు. బీజేపీ వస్తే ఆధార్ ను ఆపేస్తుందనే ప్రచారం చేశారని... తాము అదే ఆధార్ కు టెక్నాలజీని జోడించి వివిధ స్థాయుల్లో వినియోగిస్తున్నామని చెప్పారు. అసలైన లబ్ధిదారులను ఆధార్ ద్వారా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. 

Narendra Modi
ashok gajapathi raju
aviation
  • Loading...

More Telugu News