YSRCP: మోదీ ప్రసంగానికి ముందే వైసీపీ వాకౌట్.. ప్రధాని ప్రసంగిస్తున్నా, నినాదాలతో హోరెత్తిస్తున్న టీడీపీ ఎంపీలు!

  • ప్రధాని ప్రసంగానికి ముందు వాకౌట్ చేస్తున్నట్టు వైసీపీ ప్రకటన
  • నినాదాలతో హోరెత్తిస్తున్న టీడీపీ ఎంపీలు
  • నిరసనల మధ్యే కొనసాగుతున్న ప్రధాని ప్రసంగం

లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగించడానికి ముందే వైసీపీకి చెందిన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలన్నింటినీ ఇవ్వాల్సిందే అంటూ అప్పటి వరకు పట్టుబట్టిన వైసీపీ ఎంపీలు మోదీ ప్రసంగానికి ముందు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి, సభ నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు, టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఓవైపు మోదీ మాట్లాడుతుంటే, టీడీపీ ఎంపీలు వెల్ లోనే ఉండిపోయి, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిరసనలు, నినాదాల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగుతోంది.

YSRCP
Telugudesam
Narendra Modi
parliament
mps
  • Loading...

More Telugu News