Parliament: ఇక్కడే ఇలా చేస్తున్నారంటే... ఇంట్లో ఇంకెలా ఉంటారో?: టీడీపీ ఎంపీలకు స్పీకర్ చురక

  • లోక్ సభలో నినాదాలు ఆపని టీడీపీ ఎంపీలు
  • మీ పిల్లలను కూడా క్రమశిక్షణలో ఉంచలేరు
  • కీలక వ్యాఖ్యలు చేసిన సుమిత్రా మహాజన్

ఎంత నచ్చజెపుతున్నా వినకుండా లోక్ సభలో నినాదాలు చేస్తూ పోడియం ముందు నిలబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉద్దేశించి స్పీకర్ సుమిత్రా మహాజన్ చురకలంటించారు. ఎంపీలు చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, ఇక్కడే ఇలా ఉన్నారంటే, ఇంట్లో ఇంకెలా ఉంటారోనని, తమ పిల్లలను కూడా వీరు క్రమశిక్షణలో పెట్టలేనట్టుగా అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా సాగేందుకు ఏపీ ఎంపీలు సహకరించాలని కోరారు.

"నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. మీమీ స్థానాల్లోకి వెళ్లండి. ఈ విధమైన అల్లరి చిన్న పిల్లలు కూడా చేయరు. మీరు మీ ఇళ్లలో పిల్లలను ఎలా కంట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. ఇలా ప్లకార్డులు పట్టుకుని మాట్లాడుతున్న సభ్యుల ముఖం ముందు పెట్టడం మంచి పధ్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోండి" అని అన్నారు.

Parliament
Sumitra Mahajan
Lok Sabha
Telugudesam
MPS
  • Loading...

More Telugu News