KVP: సొంత పార్టీ సభ్యుల వైఖరితో మనస్తాపానికి గురైన కేవీపీ.. బయటకు వెళ్లి పార్లమెంట్ ముందు నిలబడ్డ వైనం!
- మూడు రోజులుగా నిలబడి ఆందోళన చేస్తున్న కేవీపీ
- కేవీపీని వెనక్కు రావాలన్న కాంగ్రెస్ ఎంపీలు
- ఆయన్ను సమర్థించబోమన్న గులాం నబీ
- బయటకు వచ్చి నిరసన తెలిపిన కేవీపీ
గత మూడు రోజులుగా పార్లమెంట్ లో చైర్మన్ చైర్ ముందు నిలబడి ఆందోళన చేస్తున్న కేవీపీ రామచంద్రరావుకు కనీసం కాంగ్రెస్ సభ్యుల నుంచి కూడా మద్దతు కరవవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతోందని ఆయన ఒక్కరే ఆందోళన చేస్తుంటే మరెవరూ తోడు రాని పరిస్థితి నెలకొంది.
కేవీపీ వెల్ నుంచి వెనక్కు రావాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు పిలవడం, ఆయన వైఖరిని తాము సమర్థించబోవడం లేదని గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో ఆయన నొచ్చుకున్నారు. ఇదే సమయంలో 255వ నిబంధన కింద బయటకు వెళ్లాలని ఆదేశిస్తానని చైర్మన్ స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు పేర్కొనడంతో కేవీపీ బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ ముందు ప్లకార్డు పట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది.