nagarjuna: నాగ్ .. నాని మల్టీస్టారర్ కి ముహూర్తం ఖరారు

  • నాగ్ .. నాని కాంబినేషన్లో మల్టీ స్టారర్
  • డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని 
  • ఈ నెల 24న సెట్స్ పైకి 
  • మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్  

నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ మూవీ చేయడానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా వున్నాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

నాగ్ మాఫియా డాన్ గా కనిపించనుండగా .. డాక్టర్ పాత్రను నాని పోషించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసం కథానాయికల అన్వేషణ జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున .. వర్మ సినిమా చేస్తున్నారు. ఇక 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో నాని బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగులు పూర్తికాగానే, తాజా ప్రాజెక్టు సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News