Jagan: గురు, శుక్రవారాల్లో ఆగనున్న జగన్ పాదయాత్ర

  • రేపు రాష్ట్ర బంద్
  • మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్
  • బంద్ లో కార్యకర్తలు పాల్గొనాలన్న పార్టీ

తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణ కారణంగా ప్రతి గురువారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ తన ప్రజా సంకల్పయాత్రకు బ్రేక్ ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, పాదయాత్ర ప్రారంభించిన తరువాత తొలిసారిగా రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన తన పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నట్టు వైకాపా వెల్లడించింది.

బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా 8వ తేదీ గురువారం నాడు రాష్ట్ర బంద్ కు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి మద్దతు ప్రకటించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ బంద్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చినట్టు వెల్లడించారు. 

Jagan
YSRCP
Prajasankalpa yatra
State Band
  • Loading...

More Telugu News