raviteja: అమెరికాలో 'అమర్ అక్బర్ ఆంథోని' షూటింగ్

  • 'అమర్ అక్బర్ ఆంథోని' ఈ నెలలోనే మొదలు 
  • తొలి షెడ్యూల్ అమెరికాలో 
  • రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు

ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్లతో కలిసి రవితేజ 'అమర్ అక్బర్ ఆంథోని' సినిమా చేయనున్నాడు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

తొలి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. రవితేజ కాకుండా ఇతర ముఖ్య పాత్రలపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన ముగ్గురు కథానాయికలు కనువిందు చేస్తారని చెబుతున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News