Sonakshi Sinha: వారిపై కఠిన చర్యలు తీసుకోండి: రాజస్థాన్ మంత్రికి లేఖ రాసిన బాలీవుడ్ నటి!

  • జైపూర్ కోటలో ఏనుగును హింసించిన సంరక్షకులు
  • కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రికి సోనాక్షి లేఖ
  • పెటాకు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సోనాక్షి

రాజస్థాన్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గజేంద్రసింగ్ కు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా లేఖ రాసింది. జైపూర్ నగరంలో పర్యాటకుల సవారీ కోసం వినియోగిస్తున్న ఏనుగులకు స్వేచ్ఛను ప్రసాదించాలని లేఖలో ఆమె కోరింది. జంతు హక్కుల పరిరక్షణ సంస్థ 'పెటా'కు సోనాక్షి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. పెటా ఇండియా తరపున మంత్రికి ఆమె లేఖ రాసింది.

జైపూర్ అంబర్ కోటలో ఉన్న ఓ ఏనుగును ఎనిమిది మంది వ్యక్తులు కొడుతుండగా, అమెరికాకు చెందిన పర్యాటకులు ఆ ఘటనను ఫొటో తీశారు. ఈ ఫొటోల ఆధారంగా ఏనుగును హింసించిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, ఏనుగులకు స్వేచ్ఛను ప్రసాదించాలని లేఖలో సోనాక్షి కోరారు. సోనాక్షి లేఖపై స్పందించిన అధికారులు... ఏనుగు సంరక్షకులకు నోటీసులు జారీ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Sonakshi Sinha
peta
Rajasthan
gajendra singh
elephant
  • Loading...

More Telugu News