Gali Muddu Krishnama Naidu: నాకెంతో అండగా నిలిచిన అన్నను కోల్పోయా!: లక్ష్మీపార్వతి కంటతడి

  • ఈ తెల్లవారుజామున మరణించిన గాలి ముద్దుకృష్ణమనాయుడు
  • కేర్ అసుపత్రిలో నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి
  • ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని వెల్లడి

డెంగ్యూ జ్వరంతో హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూసిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడికి వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఆయన బంధువులను ఓదార్చుతూ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకెంతో అండగా నిలిచిన ఓ సోదరుడిని కోల్పోయానని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ పిలుపునిస్తే, ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారని, ఎన్టీఆర్ కు అండగా నిలిచిన వ్యక్తని అన్నారు. తనకు పెద్దన్న వంటి వ్యక్తని, రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన పార్టీ మారారని, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తని అన్నారు. తాను పాతపట్నంలో ఎమ్మెల్యేగా నిలబడితే గెలవడానికి చాలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. గాలి ముద్దుకృష్ణమకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Gali Muddu Krishnama Naidu
Care Hospital
Lakshmi Parvati
  • Error fetching data: Network response was not ok

More Telugu News