PAN Card: పాన్ కార్డు కోసం వారానికి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో తెలిస్తే అవాక్కే!

  • వారానికి 15-25 లక్షల దరఖాస్తులు
  • పరిశీలించి జారీ చేసేందుకు రెండు వారాల సమయం
  • జనవరి 28 నాటికి పెండింగ్‌లో 20.7 లక్షల దరఖాస్తులు

పాన్ కార్డు కోసం వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కోసం వారానికి 15-25 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నట్టు పేర్కొంది. వీటిని పరిశీలించి పాన్‌కార్డులను జారీ చేసేందుకు కొన్ని గంటల నుంచి రెండు వారాల వరకు పడుతోందని వివరించింది.

ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి 20.7 లక్షల అప్లికేషన్లు ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

పాన్ దరఖాస్తులను ఐటీ విభాగం ఎన్ఎస్‌డీఎల్ ఈ-జీవోవీ, యూటీఐటీటీఎస్ఎల్ ద్వారా స్వీకరించి, ప్రాసెస్ చేసి డేటాను డిజిటలైజ్ చేస్తుంది. అనంతరం ఆ వివరాలను ఐటీడీకి పంపుతుంది. అక్కడ చివరిసారి పరిశీలించి దరఖాస్తుదారుడికి పాన్‌కార్డును జారీ చేస్తారు.

  • Loading...

More Telugu News