Space X: 18 వేల జట్ లైనర్స్ శక్తితో... ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగించిన అమెరికా

- స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ ప్రయోగం విజయవంతం
- వేలాది మంది చూస్తుండగా దూసుకెళ్లిన రాకెట్
- ఓ పర్వతమంత విస్తరించిన పొగ
- 27 ఇంజన్ లతో రాకెట్ డిజైన్
ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన రాకెట్ 'స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ'ని అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. కేప్ కెనవెరల్ లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించగా, వేలాది మంది ప్రత్యక్షంగా తిలకించారు. భూమి నుంచి అంగారకుడి వరకూ ఉన్న దూరాన్ని ఏకధాటిగా అధిగమించేంతటి శక్తి దీని సొంతం. 18,747 జెట్ లైనర్స్ కు ఉండేంత శక్తితో ఇది ఆకాశంలోకి దూసుకెళ్లింది. చంద్రమండలం మీదకు అపోలో 11 సిబ్బందిని తీసుకెళ్లిన లాంచ్ ప్యాడ్ పై నుంచి దీన్ని ప్రయోగించడం గమనార్హం. ఈ రాకెట్ కదిలే ముందు, ఇంజన్ లను ఆన్ చేసిన తరువాత వచ్చిన పొగ ఓ భారీ పర్వత విస్తీర్ణమంత కనిపించింది.
