Philippenes: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడంటే ఇంతేమరి... దగ్గరుండి లగ్జరీ కార్లను బుల్డోజర్లతో తొక్కించిన వైనం... వీడియో చూడండి!
- అనుమతి లేకుండా ఫిలిప్పీన్స్ లోకి లగ్జరీ కార్లు
- స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన కస్టమ్స్ అధికారులు
- దగ్గరుండి పర్యవేక్షించిన రోడ్రిగో డ్యూటిరెట్టో
ఎటువంటి ముందస్తు అనుమతులూ తీసుకోకుండా దేశంలోకి అత్యంత ఖరీదైన కార్లను దిగుమతి చేశారని ఆరోపిస్తూ, 20 లగ్జరీ కార్లను దగ్గరుండి బుల్డోజర్లతో తొక్కించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటిరెట్టో. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆడి, మెర్సిడిస్ బెంజ్ తదితర కంపెనీల కార్లను మనీలాలోని ఓ ప్రాంతానికి చేర్చగా, వాటిపైకి బుల్డోజర్లను ఎక్కించారు. వీటి విలువ సుమారు 11,83,000 యూఎస్ డాలర్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డ్రగ్స్, అక్రమ ఆయుధ వ్యాపారంపై ఉక్కుపాదం మోపి, ఎంతోమందికి మరణదండన విధించేలా చేసిన ఆయన, ఇప్పుడు అక్రమ దిగుమతులపైనా కొరడా ఝళిపించడం ప్రారంభించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.