Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అదృష్టం అంటే కన్నడ భామదే!
  • ముంబయ్ లో నాగార్జున ఫైట్స్ 
  • 'రోషగాడు'లో నివేదా పేతురాజ్ 
  • బన్నీ సినిమా మలయాళం వెర్షన్ కు టైటిల్ రెడీ!

*  అదృష్టం అంటే రష్మికదే అంటున్నారు. కన్నడలో తన తొలి చిత్రం 'కిరిక్ పార్టీ'తో తను అక్కడ హిట్ కొట్టగా.. తెలుగులో తొలి చిత్రం 'ఛలో'తో ఇక్కడా హిట్ కొట్టింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వెళుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న రష్మిక త్వరలో మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పనుంది.  
*  నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబయ్ లో జరుగుతోంది. ఎస్సెల్ వరల్డ్ థీం పార్క్ లో ఈ చిత్రం యాక్షన్ దృశ్యాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోని కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'రోషగాడు'. గణేశ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తుండగా, ఆయన సరసన కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ బోర్డర్ లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. ఆ వెర్షన్ కి 'ఎంటె పేరు సూర్య..  ఎంటె వీడు ఇండియా' అన్న టైటిల్ ను ఖరారు చేశారు.  

  • Loading...

More Telugu News