rajanikanth: రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే ఇండియా....!: వర్మ ఆసక్తికర ట్వీట్

  • రజనీకాంత్ రాజకీయం, సినిమా మిక్స్ చేసి ట్వీట్ చేసిన వర్మ
  • రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటన చేసిన రజనీకాంత్
  • విడుదలకు సిద్ధంగా ఉన్న రజనీ 2.0 సినిమా

సోషల్ మీడియా ద్వారా వివిధ అంశాలపై స్పందించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా రజనీకాంత్‌ రాజకీయం, త్వరలో విడుదల కానున్న 2.0 సినిమాలను మిక్స్ చేస్తూ ట్విట్టర్ లో తనదైనశైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 దేశాల్లో భారత్‌ కూడా ఒక దేశం. అదే రజనీకాంత్‌ ప్రధానమంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుంది’’ అని పేర్కొన్నాడు.

మరో ట్వీట్‌ లో ‘‘శివ సినిమాతో నాగార్జున నాకు కిక్ స్టార్ట్ ఇచ్చాడు. ఇన్నేళ్ల తరువాత నాకు మరో కిక్ కావాలి. రిలీజ్ డేట్, టైము త్వరలోనే ప్రకటిస్తాను. నాగార్జునతో హిట్ కొట్టకపోతే ఆయన ఫ్యాన్స్ నన్ను తన్నేందుకు సిద్ధంగా ఉన్నారు. సినిమాలో విలన్స్ కోసం నువ్వు కిక్స్ రెడీ చెయ్యి, నన్ను తన్నేందుకు నీ ఫ్యాన్స్ కిక్స్ ను రెడీగా ఉంచమను’’ అంటూ ట్వీట్ చేశాడు.

rajanikanth
ramgopal verma
RGV
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News