Viral Videos: మొబైల్ షాప్ ఓనర్ని చావగొట్టిన హిందూ జాగ్రన్ మంచ్ కార్యకర్తలు.. వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణ ఘటన
- మొబైల్ ఫోన్ పాడైపోయిందని షాప్‌కి వచ్చిన యువకుడు
- కస్టమర్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని చెప్పిన మొబైల్ షాప్ ఓనర్
- రచ్చ రచ్చ చేసిన వైనం
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ షాప్ ఓనర్ని హిందూ జాగ్రన్ మోర్చ్ కార్యకర్తలు అందరూ చూస్తుండగానే చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే హిందూ జాగ్రన్ మోర్చ్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సదరు మొబైల్ షాపులో ఓ ఫోన్ కొనుక్కున్నాడు. నిన్న ఆ షాపు వద్దకు వచ్చి ఆ ఫోను పనిచేయడం లేదని చెప్పాడు. దీంతో సదరు షాపు ఓనర్ కస్టమర్ కేర్ సర్వీస్ వద్దకు వెళ్లమని చెప్పాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆ వ్యక్తి తమ హిందూ జాగ్రన్ మోర్చ్ కార్యకర్తలతో వచ్చి ఓ షాపు ఓనర్ ని బయటకు లాగేసి చావగొట్టాడు.