Samantha: పాపం.. సమంతకి షూటింగ్ కష్టాలు!

  • 'రంగస్థలం' కోసం మండుటెండలో యాక్టింగ్
  • ఇపుడు 'సూపర్ డీలక్స్' కోసం మరో కష్టం
  • తనతో ఇలాంటి ఆటలెందుకంటూ దేవుడితో మొర
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్టింగ్ చేసిన బ్యూటీ క్వీన్

రామ్‌చరణ్ సరసన నటించిన 'రంగస్థలం' సినిమా కోసం రాజమహేంద్రవరంలో మండుటెండల్లో షూటింగ్‌లో పాల్గొన్న యంగ్ బ్యూటీ సమంత ఇపుడు మరో సినిమా కోసం మరో రకమైన కష్టాన్ని ఎదుర్కొంటోంది. విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న 'సూపర్ డీలక్స్' చిత్రం కోసం ఆమె రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోందట పాపం. చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో ఈ చిత్రీకరణ జరుగుతోంది. సెట్‌కి  సంబంధించిన ఒక ఫొటోని కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

 ఆ ఫొటోపై 'రాజమహేంద్రవరంలో మండుటెండలో చిత్రీకరణలో పాల్గొన్నాను. ఇపుడు టెన్సకిలో రాత్రిళ్లు వర్షంలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దేవుడా...నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్?' అంటూ ఏడుస్తున్న ఇమేజ్‌ను ఆమె జత చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన రంగస్థలం, అభిమన్యుడు, మహానటి, యూటర్న్ చిత్రాలు విడుదల కానున్నాయి.

Samantha
Rangasthalam
Vijay
super deluxe
  • Loading...

More Telugu News