Kamineni Srinivas: టీడీపీపై సోము వీర్రాజు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కామినేని

  • చంద్రబాబుకు ఇంత డబ్బు ఎలా వచ్చిందని సోము వీర్రాజు వ్యాఖ్యలు
  • మిత్ర పక్షం గురించి ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదు: కామినేని 
  • అంతర్గత సమావేశాల్లో తప్ప బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అధిష్ఠానం సూచించింది 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలులో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండెకరాల రైతునని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ స్పందించారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. మిత్ర పక్షం గురించి ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గత సమావేశాల్లో తప్ప బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని తమ పార్టీ అధిష్ఠానం సూచన చేసిందని, దానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు.

Kamineni Srinivas
somu veerraju
Telugudesam
  • Loading...

More Telugu News