Maldives: మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం, ఎమర్జెన్సీ: భారత్ సాయం కోరిన మాజీ అధ్యక్షుడు
- ఆ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు మరో జడ్జి అరెస్టు
- భారత్ జోక్యం చేసుకోవాలి- మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు
- వెంటనే మిలటరీని పంపాలి
మాల్దీవుల్లో పరిస్థితులు అదుపు తప్పుతోన్న విషయం తెలిసిందే. రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్.. తమ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో జడ్జి అలీ అహ్మద్‌ను అరెస్టు చేయించారు. దీంతో ఆ దేశ బహిష్కృత మాజీ అధ్యక్షుడు మహ్మద్ నసీద్ భారత్ సాయాన్ని కోరారు.
తమ దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, వెంటనే మిలటరీని పంపాలని అన్నారు. కాగా, రాజకీయ రెబల్స్‌ను విడిచిపెట్టాలని కొన్ని రోజుల క్రితం మాల్దీవుల అత్యున్నత న్యాయస్థానం ఆదేశించగా, కోర్టు తీర్పును ధిక్కరిస్తూ, ఆ దేశ అధ్యక్షుడు పలువురిని అరెస్టు చేయిస్తుండడంతో కలకలం చెలరేగుతోంది.