Arun Jaitly: ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

  • ఈఏపీల ద్వారా ప్రత్యేక హోదా లోటును భర్తీ చేస్తాం
  • ఈఏపీలకు నాబార్డు నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరారు
  • ఆ విధంగా నిధులివ్వాలంటే సమస్య ఎదురవుతోంది
  • ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నాం: రాజ్యసభలో జైట్లీ

ఏపీ విభజన చట్టం హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయమై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాతో రావాల్సిన నిధులను ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎలా ఇవ్వాలన్నదే ప్రధాన అంశమని, ఎక్స్ టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ)ల ద్వారా ప్రత్యేక హోదా లోటును భర్తీ చేస్తామని అన్నారు.

ఈఏపీలపై జనవరి 3న ఏపీ సీఎం చంద్రబాబు ఒక లేఖ రాశారని, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు కేటాయించాలని బాబు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే, ఈఏపీలకు నాబార్డు ద్వారా నిధులు ఇవ్వాలంటే సమస్య ఎదురవుతోందని, ఆవిధంగా నిధులిస్తే రాష్ట్ర రుణ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు.

దీంతో, ఈఏపీ నిధులు ఎలా ఇవ్వాలనే విషయమై చర్చిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని చెప్పారు. ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.3,990 కోట్లు చెల్లించామని ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News