pakistan: భారత్ దుస్సాహసానికి పూనుకుంటే ప్రతిస్పందన చూడాల్సి వస్తుందన్న పాక్ మంత్రి

  • అది ఎంత తీవ్రతతో ఉంటుందో చెప్పలేం
  • హెచ్చరించిన పాక్ రక్షణ మంత్రి దస్తగిర్
  • కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ భారత్ కు ఓ హెచ్చరిక చేశారు. దుస్సాహసానికి పూనుకుంటే ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇస్లామాబాద్ లోని అధ్యక్ష భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో దస్తగిర్ ఈ హెచ్చరిక చేశారు.

‘‘దుస్సాహసం చేసే హక్కు వారికి (భారత్) ఉంది. దీనికి ప్రతిస్పందించే హక్కు మాకు ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్రతతో ఉంటుందన్నది మాకు సంబంధించిన అంశం’’ అని దస్తగిర్ అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని చెప్పారు. కానీ, యుద్ధం ప్రకటించిన సమయంలో దీన్ని స్పందించలేని బలహీనతగా, పరిమితిగా చూడొద్దన్నారు. కశ్మీర్ లో మానవత్వానికి వ్యతిరేకంగా భారత దళాలు నేరాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News