nagarjuna: ధనుష్ ఆఫర్ .. ఆలోచనలో పడిన నాగార్జున!

  • ధనుష్ దర్శకత్వంలో తమిళ మూవీ 
  • కీలక పాత్ర కోసం నాగ్ తో సంప్రదింపులు
  • ఇంకా తన నిర్ణయాన్ని చెప్పని నాగ్ 

కోలీవుడ్లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే యువ కథానాయకులలో ధనుష్ పేరు ముందువరుసలో కనిపిస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా.. దర్శకుడిగా కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రజనీతో 'కాలా' సినిమాను నిర్మిస్తోన్న ఆయన, మరో సినిమాకి దర్శకుడిగా వ్యవహరించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. తమిళంతోపాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నాడు.

అందువలన ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రను చేయవలసిందిగా ముందుగా చిరంజీవిని అడిగారట. 'సైరా' పనులతో బిజీగా వున్న చిరంజీవి .. కుదరదని చెప్పడంతో, నాగార్జునను సంప్రదించారట. కథ .. తనకి ఆఫర్ చేసిన పాత్ర నాగార్జునకి బాగా నచ్చాయట .. అయితే ఆయన ఇంకా తన నిర్ణయాన్ని మాత్రం తెలియజేయలేదు. దాదాపు ఆయన ఓకే చేయవచ్చనేది సన్నిహితుల మాట. ఈ సినిమాలో హీరోగా ధనుష్ చేస్తాడా? లేదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.  

nagarjuna
dhanush
  • Loading...

More Telugu News