shriya saran: పెళ్లి పీటలు ఎక్కుతున్న హీరోయిన్ శ్రియ?

  • మార్చిలో శ్రియ వివాహం
  • రష్యన్ యువకుడితో సన్నిహితంగా ఉన్న శ్రియ
  • రాజస్థాన్ లో పెళ్లి ఏర్పాట్లు

దక్షిణాదిలో మంచి నటిగా పేరుతెచ్చుకున్న శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి నెలలో శ్రియ వివాహం జరగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రష్యన్ యువకుడితో శ్రియ చాలా సన్నిహితంగా ఉంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందట. పెళ్లి విషయాన్ని అబ్బాయి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. రాజస్థాన్ లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

shriya saran
shriya
tollywood
marriage
  • Loading...

More Telugu News