Kulbhushan Jadav: ఇప్పటికే మరణశిక్ష విధించబడ్డ జాదవ్ పై మరో కేసు పెట్టిన పాకిస్థాన్

  • జాదవ్ పై తాజాగా మోసం, విద్రోహం కేసులు
  • చార్జ్ షీట్ దాఖలు చేసిన పాక్ పోలీసులు
  • వెల్లడించిన 'డాన్' పత్రిక

తమ దేశానికి భారత్ తరఫున గూఢచారిగా వచ్చాడని ఆరోపిస్తూ, కుల్ భూషణ్ జాదవ్ ను అక్రమంగా నిర్బంధించి, మరణదండన వేసిన పాకిస్థాన్, ఇప్పుడాయనపై మరో కేసును నమోదు చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి ఒత్తిడితో జాదవ్ కు విధించిన మరణశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసిన పాక్, ఇప్పుడు జాదవ్ పై ఉగ్రవాదం, మోసం, విద్రోహం కేసులు పెట్టి విచారణ ప్రారంభించింది. ఈ విషయాన్ని 'డాన్' పత్రిక ప్రచురిస్తూ, ఈ కేసులో చార్జ్ షీట్ కూడా వేసినట్టు వెల్లడించింది.

 కాగా, గత సంవత్సరం మార్చిలో జాదవ్ ను ఇరాన్ లో పట్టుకుని, పాక్ కు తీసుకొచ్చి, తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆయన వచ్చాడని, తమ సైన్యం అతన్ని అరెస్ట్ చేసిందని చెబుతూ, సైనిక కోర్టు ముందు నిలిపి, హడావుడిగా మరణశిక్ష వేయించిన సంగతి తెలిసిందే.

Kulbhushan Jadav
India
Pakistan
  • Loading...

More Telugu News