Hot Calling Gang: భువనగిరి కేంద్రంగా అమ్మాయిలను ముగ్గులోకి దింపే 'హాట్ కాలింగ్' గ్యాంగ్... పట్టేసిన పోలీసులు!

  • గొంతు బాగున్న అమ్మాయిలకు ఎరేస్తున్న కాల్ సెంటర్
  • క్లయింట్లతో డర్టీ టాకింగ్ చేయడమే వారి ఉద్యోగం
  • బెదిరించి మాట్లాడిస్తున్న వీరాస్వామి అరెస్ట్

 అమ్మాయి అందంగా ఉంటుందా? అన్నది వాళ్లకు అనవసరం. గొంతు బాగుంటే చాలు. కాస్తంత హస్కీ వాయిస్, మాట్లాడే మాటల్లో కాస్తంత రొమాంటిక్ టచ్ ఉంటుందని అనుకుంటే చాలు. వారిపై వలేస్తారు. ఎక్కువ జీతాలు ఇస్తామని నమ్మబలుకుతారు. కాల్ సెంటర్ లో పని చేయాలని చెప్పి, ఐదంకెల వేతనం ఆఫర్ చేసి, బాండ్ రాయించుకుని ఆపై తమ అసలు ఉద్దేశం చెబుతారు.

వారు చేయాల్సిన పని 'హాట్ కాలింగ్'. తమ కస్టమర్లకు ఫోన్ చేసి, వారితో డర్టీ టాకింగ్ చేయడమే వారి ఉద్యోగం. అంటే మాటలతోనే శృంగారమన్నమాట. భువనగిరి కేంద్రంగా సాగుతున్న ఈ హాట్ కాలింగ్ గ్యాంగ్ ను పోలీసులు పట్టేశారు. పట్టణ పరిధిలోని మీనా నగర్ కేంద్రంగా ఈ దందా సాగుతోందని, ఇందులో దాదాపు 20 మంది అమ్మాయిలు పని చేస్తున్నారని గుర్తించిన పోలీసులు కాల్ సెంటర్ పై దాడి చేశారు.

సెంటర్ ను నిర్వహిస్తున్న వీరాస్వామి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, సెంటర్ ను సీజ్ చేశామని తెలిపారు. తన కస్టమర్ల నుంచి నెలకు రూ. 5 నుంచి 10 వేల వరకూ తీసుకునే వీరాస్వామి, వారు ఫోన్ చేసినప్పుడల్లా, తన వద్ద ఉండే లేడీ కాలర్స్ తో డర్టీ టాకింగ్ చేయిస్తాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అమ్మాయిలను బెదిరించి ఈ పని చేయిస్తున్నాడని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Hot Calling Gang
Bhuvanagiri
Voice
Dirty Talking
Police
  • Loading...

More Telugu News