Telugudesam: రాజ్ నాథ్ కోసం మూడు గంటలు వెయిట్ చేసి, పావు గంట సమావేశం... టీడీపీ ఎంపీలకు ఆయన చెప్పిందిదే!

  • ప్రజల ఆగ్రహం రెండు పార్టీలకూ మంచిది కాదు
  • రాజ్ నాథ్ కు స్పష్టం చేసిన టీడీపీ ఎంపీలు
  • మరోసారి ప్రధానితో మాట్లాడమని హోం మంత్రి సలహా
  • ఆశించిన స్పందన రాలేదన్న సుజనా చౌదరి

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, తక్షణం రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి పెద్దగా హామీలేవీ రాలేదు. ఆయన ముందస్తు అపాయింట్ మెంట్ల కారణంగా దాదాపు మూడు గంటల పాటు వేచి చూసిన ఎంపీలు, ఆపై 15 నిమిషాలు మాత్రమే రాజ్ నాథ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

కేంద్ర మంత్రులు అశోకగజపతి రాజు, సుజనా చౌదరి, ఎంపీలు తోటనరసింహం, నిమ్మల కిష్టప్ప, కే రామ్మోహన్‌ నాయుడులు రాజ్ నాథ్ ను కలవగా, రాష్ట్రంలోని పరిస్థితులపై ఆరా తీసిన ఆయన, మరోసారి ప్రధానిని కలవాలని సూచించారు. ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం రెండు పార్టీలకూ మంచిది కాదని టీడీపీ నేతలు చెప్పగా, ఆలస్యం కాకుండా విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరిస్తామని, అందుకోసం హోం శాఖ తరపున ఏం చేయాలో అది చేస్తానని చెప్పారు.

ఆపై కాస్తంత నిరాశగా ఎంపీలు బయటకు వచ్చారు. సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ రాజ్ నాథ్ తో సమావేశంలో పెద్దగా చర్చలేమీ జరగలేదని, ఆయన నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News