Chandrababu: నారాయణ ఫస్ట్, లోకేష్ సెకండ్, గంటా లాస్ట్... పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు

  • పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు 
  • మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు
  • చివరి నుంచి రెండో స్థానంలో ఆదినారాయణరెడ్డి
  • మెరుగుపడకుంటే ఉద్వాసన తప్పదన్న సంకేతాలు

మంత్రుల పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ర్యాంకులను ప్రకటించారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో ముందున్నారంటూ పలువురు మంత్రులకు కితాబిచ్చారు. తాను ఎన్నో అంశాలను పరిశీలించి ఈ ర్యాంకులను ఇస్తున్నానని చెప్పిన ఆయన తొలి స్థానంలో నారాయణ, రెండో స్థానంలో నారా లోకేష్ ఉన్నారని చెప్పారు.

అలాగే, మూడవ స్థానంలో సుజయకృష్ణ రంగారావు వున్నారని అన్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో మంత్రులు ఆదినారాయణరెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. మంత్రులంతా తమ పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టిని పెట్టాలని సూచించిన చంద్రబాబు, పనితీరు బాగాలేకుంటే పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమని హెచ్చరించారు.

Chandrababu
Nara Lokesh
Narayana
Sujayakrishna Rangarao
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News