Uttar Pradesh: యోగి పాలనలో రికార్డు స్థాయి ఎన్ కౌంటర్లు!

  • ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేసి పది నెలలు
  • ఎన్ కౌంటర్ల లెక్కలు విడుదల చేసిన యూపీ ప్రభుత్వం
  • ఆపరేషన్ క్లీన్ పేరుతో 1,142 ఎన్ కౌంటర్లు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి పది నెలల కాలం ముగుస్తోంది. ఈ పదినెలల కాలంలో యూపీలో రికార్డు స్థాయిలో ఎన్ కౌంటర్లు జరగడం కలకలం రేపుతోంది. యూపీలో గత పది నెలల్లో మొత్తం 1,100 పోలీస్ ఎన్‌ కౌంటర్లు జరగగా, అందులో 34 మంది నేరస్థులు ప్రాణాలు కోల్పోగా, 265 మంది గాయపడ్డారు. మొత్తం 2,744 మంది పేరుమోసిన రౌడీషీటర్లు అరెస్టయ్యారు.

ఈ క్రమంలో నలుగురు పోలీసులు మృత్యువాతపడగా, 247 మంది గాయపడ్డారు. సీఎం యోగి ఆదేశాల ప్రకారం 'ఆపరేషన్ క్లీన్' పేరుతో నేరస్థుల ఏరివేత చర్యలు వేగంగా జరుగుతున్నాయి. యూపీ పోలీస్ గణాంకాల ప్రకారం, 2017 మార్చి 20 నుంచి 2018 జనవరి 31వరకు యూపీలో మొత్తం 1,142 ఎన్‌ కౌంటర్లు చోటుచేసుకోగా, మీరట్ జోన్‌ లో 449, ఆగ్రా జోన్‌ లో 210 ఎన్‌ కౌంటర్లు జరిగాయి. 196 ఎన్‌ కౌంటర్లతో బరేలీ జోన్ మూడో స్థానంలో ఉండగా, 91 షూటౌట్లతో కాన్పూర్ జోన్ నాల్గవస్థానంలో ఉంది. 

Uttar Pradesh
yogi adityanath
up cm
encounters
  • Loading...

More Telugu News