turkey: ఎడమ చేతితో ఆహారం తీసుకునేవారంతా రాక్షసులు!: సంచలన ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ

  • టర్కీలో ఆహారం తినే విధానంపై ఫత్వా జారీ  
  • కుడి చేతితోనే ఆహారం తీసుకోవాలి
  • ఎడమచేతితో తినడాన్ని మహమ్మద్ ప్రవక్త కూడా వ్యతిరేకించారు 

ముస్లింలంతా కుడిచేతితోనే ఆహారం తీసుకోవాలని, ఎడమచేతిని వినియోగించకూడదని టర్కీ అధికారిక డైరెక్టరేట్ ఆఫ్ రిలిజియస్ అఫైర్స్ (డియానెట్) సంచలన ఫత్వా(డిక్రీ) జారీ చేసింది. ముస్లింలంతా దీనిని విధిగా పాటించాలని చెప్పింది. ఆహారం తీసుకునేందుకు ఎడమచేతిని వినియోగించేవారు రాక్షసులని పేర్కొంది. గతంలో ఎడమచేతితో తినే అలవాటు ఉన్నవారు, ఆ అలవాటును మానుకోవాలని ఆ సంస్థ ఆదేశించింది.

ఎడమచేతితో తినడాన్ని మహమ్మద్ ప్రవక్త కూడా మంచిగా పరిగణించలేదని, ఆ అలవాటును తీవ్రంగా పరిగణించేవారని ఆ సంస్థ స్పష్టం చేసింది. మహమ్మద్ ప్రవక్త ఆదేశాలను, సలహాలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆ అధికారిక ఫత్వాలో పేర్కొంది.  

turkey
directorate of religious affaires
turkish directorate of religious affairs
  • Loading...

More Telugu News