Cricket: ఈ అభినందనలన్నీ వాళ్లకే చెందుతాయి : టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

  • ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదే, నాది కాదు
  • ఒత్తిడిని జయిస్తూ జట్టును గెలిపించారు
  • ఎంతో బాగా రాణించారు : రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు

అండర్ -19 ప్రపంచ కప్ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై భారతజట్టు విజయం నేపథ్యంలో ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ ఆ ప్రశంసలను సున్నితంగా తిరస్కరించారు. న్యూజిలాండ్ నుంచి టీమ్ ముంబై చేరుకున్న సందర్భంగా ఆటగాళ్లకు ముంబైలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీమిండియా జట్టు పాల్గొంది.

ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదేనని, తనదేమీ లేదని, ఒత్తిడిని జయిస్తూ జట్టును గెలిపించారని, ఎంతో బాగా రాణించారని ప్రశంసించారు. ప్రణాళికాబద్ధమైన ఆటతీరు, దానిని అమలు పరిచి విజయం సాధించడంలోనే అసలైన సంతృప్తి ఉందని ద్రవిడ్ అన్నారు. అనంతరం, కెప్టెన్ పృథ్వీషా మాట్లాడుతూ, రంజీ, అండర్ -19 మ్యాచ్ లలో తాము పొందిన పరిణతే తమను విజయంబాట పట్టించిందని సంతోషం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News