Uttar Pradesh: అగ్గిపెట్టె తీసుకుని తిరిగి ఇవ్వలేదని.. లేఖ రాసి హెచ్చరించిన వైనం!

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • కంపెనీలో సహోద్యోగికి లేఖ
  • వైరల్ అయిన లేఖ

ఓ వ్యక్తి తమ ఆఫీస్‌లో దోమల రిఫిలెంట్‌ కాయిల్స్‌ కాల్చేందుకు అగ్గిపెట్టె తీసుకుని తిరిగి ఇవ్వలేదని, అది వెంటనే ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటానని తెలుపుతూ మొరదాబాద్‌ ఎలక్ట్రిసిటీ అర్భన్‌ డివిజన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్ రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూపాయి పెడితే దొరికే అగ్గిపెట్టె కోసం ఆయన చేసిన హెచ్చరిక హాస్యాస్పదంగా ఉంది. గత నెల 23న తాను అగ్గిపెట్టె ఇచ్చానని, అందులో దాదాపు 19 పుల్లలున్నాయిని, దాన్ని తీసుకొని వారం రోజు అవుతున్నా ఇప్పటికీ తిరిగివ్వలేదని ఆయన పేర్కొన్నాడు.

అగ్గిపెట్టె లేకపోవడంతో సాయంత్రం వేళలో ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, ఈ లేఖ అందిన మూడు రోజుల్లోపు అగ్గిపెట్టెను తిరిగివ్వాలని ఆయన లేఖలో హెచ్చరించాడు. ఈ లేఖను ఆఫీస్‌ అధికారిక స్టాంప్ వేసి పంపాడు. చివరకు ఈ లేఖ వాట్సప్‌లో వైరల్ కావడంతో సుశీల్‌ కుమార్ మాట్లాడుతూ... జాబ్‌లో కొత్తగా చేరిన కంప్యూటర్‌ ఆపరేటర్‌కు లెటర్‌ ఫార్మట్‌ తెలియడం కోసమే అలా రాశానని చెబుతున్నాడు. సుశీల్ కుమార్ చెప్పింది నిజమేనని సదరు కంప్యూటర్‌ ఆపరేటర్ కూడా అంటున్నాడు. హిందీలో ఉన్న‌ ఈ లేఖ‌ను ఓ పోలీస్ అధికారి కూడా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News