Donald Trump: చిన్నారి లేఖకు చలించిన ట్రంప్.. జవాబిచ్చిన అధ్యక్షుడు!

  • పిల్లల రక్షణకు చర్యలపై లేఖ ద్వారా ప్రశ్నించిన బాలిక
  • అమెరికన్ల రక్షణకు మరింత కృషి చేస్తానని ట్రంప్ భరోసా
  • పిల్లల రక్షణకు సలహాలతో అధ్యక్షుడికి మరో లేఖాస్త్రం

పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఎవా అనే ఏడేళ్ల చిన్నారి రాసిన లేఖకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బదులిచ్చారు. సౌత్ కరొలినాలోని టౌన్‌విల్లే పట్టణానికి చెందిన ఆ బాలిక స్నేహితుడు జాకోబ్ 2016లో ఓ 14 ఏళ్ల టీనేజర్ జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మానసికంగా కుంగిపోయిన ఎవా అప్పటి నుండి స్కూలుకు వెళ్లడం మానేసింది. వైద్యుల సూచన మేరకు ఆమె ఇంటి వద్ద నుండే చదువుకుంటోంది. 2017లో రాసిన ఆమె లేఖకు ట్రంప్ చలించిపోయారు.

 "ఎవా...మీ స్నేహితుడు జాకోబ్ మరణం గురించి తెలిసి నేను, నా భార్య చాలా బాధపడుతున్నాం. నీ గురించి, నీ కుటుంబం, జాకోబ్ కుటుంబం గురించి మేం దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. పాఠశాలలో భయం కూడదు. అమెరికాలో చిన్నారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాను. నిన్ను అభిమానించే వారు, మద్దతు పలికేవారు నీకు చాలామంది ఉన్నారు. నీ కలలు నెరవేరితే చూడాలనుకునే వారు కూడా ఉన్నారు" అంటూ చిన్నారిని తన సమాధానం ద్వారా ఓదార్చారు ట్రంప్. ఆయన నుండి అందిన సమాధానానికి ఆనందపడ్డ ఎవా...అందులో చిన్నారుల రక్షణకు తీసుకునే చర్యల గురించి ప్రస్తావించకపోవడంతో ఆమె తనకు తోచిన మంచి సలహాలతో మరో లేఖను ఆయనకు పంపడం గమనార్హం.

  • Loading...

More Telugu News