sensex: వరుసగా ఐదో రోజు.. భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
- పాలసీలను కఠినతరం చేయనున్న వివిధ సెంట్రల్ బ్యాంకులు
- దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 310 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్నింటిలో అమ్మకాల జోరు కొనసాగడంతో... దాని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ పాలసీలను మరింత కఠినతరం చేయబోతున్నాయనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపాయి.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 550 పాయింట్ల వరకు పతనమయింది. చివరకు కొంచెం పుంజుకుని 310 పాయింట్ల నష్టంతో 34,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 10,667 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బాంబే డయింగ్ (15.95%), పీసీ జ్యువెలర్స్ (15.74%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (12.78%), జుబిలెంట్ లైఫ్ సెన్సెస్ (9.24%), పొలారిస్ కన్సల్టింగ్ (9.22%).
టాప్ లూజర్స్:
వక్రాంజీ లిమిటెడ్ (-10.00%), స్టెరిలైట్ టెక్నాలజీస్ (-7.53%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (-6.33%), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (-6.15%), అజంతా ఫార్మా (-5.77%).