Karnataka: సెల్ఫీకి ప్రయత్నించిన అభిమాని.. లాగి కొట్టిన కర్ణాటక మంత్రి శివకుమార్‌

  • మత్రికి చిరాకు తెప్పించిన అభిమాని 
  • సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోన్న దృశ్యాలు
  • కర్ణాట‌క మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొని వెళుతుండగా ఘటన

తమ అభిమాన సినీ నటులు, రాజకీయ నాయకులు కనపడితే చాలు వారితో సెల్ఫీలు దిగాలని తెగ ఆరాటపడిపోతుంటారు అభిమానులు. అయితే, ఒక్కోసారి అభిమానుల ప్రవర్తన చికాకు పుట్టిస్తుంది. ఇటువంటి అనుభవమే కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్‌కి ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి వెళుతుండగా ఓ అభిమాని ఆయ‌న‌తో సెల్ఫీ దిగ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన స‌ద‌రు మంత్రి త‌న అభిమాని చేతిపై కొట్టాడు. దీంతో స్మార్ట్ ఫోన్ కింద‌ప‌డిపోయింది.

ఈ స‌మ‌యంలో ఇత‌రులు త‌మ స్మార్ట్ ఫోన్ ల‌లో ఈ దృశ్యాన్ని బంధించి సామాజిక మాధ్య‌మాల్లో పెట్టారు. దీంతో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. కాగా, డీకే శివ‌కుమార్ ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఇదే మొద‌టిసారి కాదు.. గ‌తంలో కూడా ఓ సారి ఆయ‌న ఇలాగే ప్ర‌వ‌ర్తించారు.   

Karnataka
Minister
DK Shivakumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News