Cricket: క్రికెటర్ శ్రీశాంత్ పై నిషేధం విషయంలో బీసీసీఐ స్పందన కోరిన సుప్రీంకోర్టు

  • నాలుగు వారాల్లోపు తెలియజేయాలని ఆదేశం
  • మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరణ
  • ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్

క్రికెటర్ శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధం విషయంలో సుప్రీంకోర్టు బీసీసీఐ స్పందన కోరింది. తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని సవాలు చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసే ఉంటుంది. సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ క్రికెటర్ శ్రీశాంత్ తరఫున వాదించారు. కేసు విచారణ ముగిసే వరకు క్రికెట్ ఆడేందుకు వీలుగా శ్రీశాంత్ కు మధ్యంతర ఉపశమనం కల్పించాలన్న అభ్యర్థనను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ తో కూడిన బెంచ్, నాలుగు వారాల్లోపు స్పందన తెలియజేయాలని బీసీసీఐని ఆదేశించింది.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్టు తేలడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధిస్తూ బీసీసీఐ గతంలో నిర్ణయం తీసుకుంది. దీన్ని తొలుత కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ముందు శ్రీశాంత్ సవాలు చేశాడు. ఇక్కడ శ్రీశాంత్ కు అనుకూలంగా తీర్పు రాగా, ఆ ఆదేశాలను తర్వాత డివిజన్ బెంచ్ నిలిపివేసింది. నిషేధాన్ని సమర్థించింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News