sanjay raut: మన ఆయుధాలు కేవలం ప్రదర్శన కోసమే: శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • పాక్ తన ఆయుధాలను మన జవాన్లను చంపడానికి వాడుతోంది
  • మనం మాత్రం రిపబ్లిక్ డేనాడు ప్రదర్శన కోసం వాడుతున్నాం
  • పాక్ కు అదే స్థాయిలో బుద్ధి చెప్పాలి

ఇండియన్ ఆర్మీపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆర్మీ లెఫ్టినెంట్ అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, పాక్ వద్ద ఆయుధాలున్నాయని, మన వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయని... అయితే ఆ ఆయుధాలతో పాక్ సైన్యం మన జవాన్లను చంపుతోందని... మన సైన్యం మాత్రం ఆయుధాలను కేవలం ప్రదర్శన కోసమే ఉంచుతోందని మండిపడ్డారు. రిపబ్లిక్ డే రోజున ప్రదర్శించడానికే మన సైన్యం ఆయుధాలను వినియోగిస్తోందని విమర్శించారు. పాక్ దురాగతాలను అదే స్థాయిలో తిప్పి కొట్టాల్సిని ఆయన డిమాండ్ చేశారు. 

sanjay raut
sihivsena
indian army
  • Loading...

More Telugu News