somu veerraju: వార్డు మెంబర్ గా గెలవడం కూడా చేత కాదు: సోము వీర్రాజుపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్‌

  • వీర్రాజును ఎమ్మెల్సీ చేసింది టీడీపీనే
  • అవినీతి పార్టీ ఇచ్చిన పదవిని ఎందుకు తీసుకున్నారు?
  • వైసీపీకి అమ్ముడుపోయారు

తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. కనీసం వార్డ్ మెంబర్ గా గెలవడం కూడా చేతకాని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసింది టీడీపీనే అని ఆయన అన్నారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీకి ఆయన అమ్ముడుబోయారని ఆరోపించారు.

 పార్టీ పేరుతో ఆయన ఎంత వసూలు చేశారో బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు. 

somu veerraju
budda venkanna
BJP
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News