allari naresh: అల్లరి నరేశ్ జోడిగా 'రంగుల రాట్నం' హీరోయిన్

  • అల్లరి నరేశ్ తో భీమనేని శ్రీనివాసరావు 
  • 'సుడిగాడు' హిట్ తరువాత చేస్తోన్న మూవీ 
  • ముఖ్యమైన పాత్రలో సునీల్  

కొంతకాలంగా అల్లరి నరేశ్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 'సుడిగాడు' సినిమా నుంచి ఆయనతో సక్సెస్ దాగుడుమూతలు ఆడుతూనే వుంది. ఈ నేపథ్యంలో అదే కాంబినేషన్లో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. భీమనేని శ్రీనివాసరావుతో 'సుడిగాడు' చేసి హిట్ కొట్టిన అల్లరి నరేశ్, ఆయనతోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమా కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించి, చివరికి 'చిత్రా శుక్లా'ను ఎంపిక చేశారట. రాజ్ తరుణ్ జోడీగా .. 'రంగులరాట్నం' సినిమాతో చిత్రా శుక్లా పరిచయమైంది. ఈ సినిమా పరాజయంపాలైనా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు దక్కాయి. యూత్ లో క్రేజ్ ను సంపాదించుకోవడం వలన ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ తో పాటు చాలామంది హాస్య నటీనటులు ఈ సినిమాలో నటించనున్నట్టుగా చెబుతున్నారు. శ్రీవసంత్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News