Balakrishna: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ

  • శనివారం ఉదయం బాలయ్యకు సర్జరీ
  • నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలయ్య
  • కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
  • ఆపరేషన్ చేసిన వైద్యులకు బాలయ్య కృతజ్ఞతలు

తన కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం హైదరాబాదు, కాంటినెంట‌ల్ హాస్పిటల్‌ లో శస్త్రచికిత్స చేయించుకున్న హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాల‌కృష్ణ కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరికొన్ని రోజులు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించడంతో, ఆయన తన ఇంటికి వెళ్లారు.

కాగా, 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం షూటింగ్‌ లో సమయంలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయ‌న 'రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్' స‌మ‌స్య‌తో బాధపడ్డారు. తరువాత వరుసగా సినిమాలు చేసిన బాలయ్య, శాశ్వత పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. డిశ్చార్జ్ అయ్యే ముందు తనకు ఆపరేషన్ చేసిన క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ లకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Balakrishna
Surgery
Continental Hospital
Hyderabad
  • Loading...

More Telugu News