Chandrababu: 'ఏపీకి అన్యాయం'పై ఇలా చేయండి: ఎంపీలకు కీలక సూచనలు ఇచ్చిన చంద్రబాబు

  • సాధ్యమైనంత ఒత్తిడి తెండి
  • అందుబాటులోని కేంద్ర మంత్రులను కలవండి
  • గాంధీ విగ్రహం ముందు ధర్నా చేయండి
  • ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందడం లేదని భావిస్తున్న టీడీపీ, ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సాధ్యమైనంత మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడి నుంచి ఎంపీలకు కీలక సూచనలు వెళ్లాయి. కొద్దిసేపటి క్రితం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, ప్రజా ప్రతినిధులంతా, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ వేదికగా నిరసన తెలపాలని ఆదేశించారు.

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూ, అందుబాటులో ఉన్న అందరు కేంద్ర మంత్రులను కలసి, ఆయా శాఖల వారీగా రాష్ట్రానికి కావాల్సిన డిమాండ్లను సాధించుకునేందుకు కృషి చేయాలని సూచించారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటి అమలుకూ ప్రయత్నించాలని అన్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి, ప్రజల్లో ఆగ్రహం ఉందన్న విషయాన్ని జాతీయ మీడియాకు తెలపాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుపై స్వల్పకాలిక చర్చకు నోటీసులిచ్చామని కొందరు ఎంపీలు చంద్రబాబుకు గుర్తు చేయగా, చర్చ తరువాత ఓటింగ్ కు పట్టుబట్టాలని కూడా చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News