Kodandaram: కోదండరామ్ కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!

  • 'తెలంగాణ జన సమితి' పేరిట పార్టీ
  • రైతు - నాగలి గుర్తుతో ప్రజల్లోకి
  • మిలియన్ మార్చ్ కి గుర్తుగా మార్చి 10న సభ

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై ఇప్పటికే యుద్ధాన్ని ప్రకటించిన  టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్, తాను పెట్టనున్న కొత్త పార్టీకి 'తెలంగాణ జన సమితి'  అనే పేరును నిశ్చయించినట్టు సమాచారం. పార్టీ గుర్తుగా 'రైతు-నాగలి'ని ఖరారు చేసినట్టు టీజేఏసీ వర్గాలు వెల్లడించాయి.

2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పై జరిగిన మిలియన్ మార్చ్ కి గుర్తుగా, ఈ సంవత్సరం మార్చి 10న వరంగల్ వేదికగా కొత్త పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్టు కోదండరామ్ ఇప్పటికే వెల్లడించారు. ఇక పార్టీ రిజిస్ట్రేషన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. జెండా, ఎజెండాలు కూడా ఖరారయ్యాయని, పలు పార్టీల నుంచి చేరికలు, నాయకత్వ అంశాలపై చర్చలు సాగుతున్నాయని టీజేఏసీ నేతలు అంటున్నారు.

Kodandaram
TJAC
NEW Politicle Party
Warangal
Telangana
  • Loading...

More Telugu News