TSR: నా సినిమాలో చిరంజీవి, పవన్ హీరోలు... కథ సిద్ధమైందన్న టీఎస్ఆర్

  • త్వరలోనే చిత్రం షూటింగ్ మొదలు
  • మార్చి 11న 'కాకతీయ కళోత్సవం'
  • హన్మకొండలో టీ సుబ్బరామిరెడ్డి

తాను తదుపరి తీయబోయే చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ సుబ్బరామిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని హన్మకొండకు వచ్చి, వెయ్యి స్తంభాల ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన, తరువాత మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

కాకతీయుల కళా వైభవాన్ని చాటి చెప్పేలా వచ్చే నెలలో వరంగల్ కోట వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. మార్చి 11న 'కాకతీయ కళోత్సవం' పేరిట ఇది జరుగుతుందని టీఎస్ఆర్ తెలిపారు. దేశంలోని పురాతన ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కాగా, టీఎస్ఆర్ వెంట ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఉన్నారు.

TSR
Hanmakonda
Warangal Rural District
Chiranjeevi
Pawan Kalyan
  • Loading...

More Telugu News